పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
విద్యద్వారానే సమాజంలోని అసమానతలు దూరం చేయవచ్చని 18 వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రి బాయ్ పూలే యత్నించారని బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బచ్చుగూడలో సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలను పద్మావతి పంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.సావిత్రి బాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, బీజేపీ ఓబీసీ మెర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్ ,జిల్లా మహిళా మొర్చా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి,మండల ప్రధాన కార్యదర్శి కావలి వీరేశం, బీజేపీ నాయకులు అల్లం రామిరెడ్డి,ఎస్‌ఆర్‌కె యువసేన సభ్యులు పాల్గొన్నారు .