శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బి. హెచ్. ఈ ఎల్ టౌన్ షప్ లోని జ్యోతి విద్యాలయలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు మాట్లాడుతు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబo సంక్రాంతి అని, వీటికి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలే నిదర్శనమన్నారు. పండుగ ఔనత్యాన్ని చక్కగా వివరిస్తూ రంగువల్లులు, బోగి మంటలు,, గోబ్బేమ్మలతో జానపదాలతో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో అలరించారు.