జ్యోతి విద్యాలయ లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు

Hyderabad politics Telangana

_విద్యార్థి నాయకుల పదవి బాధ్యతల స్వీకరణ

మనవార్తలు , శేరిలింగంపల్లి :

విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి సేవ చేయాలని బీహెచ్ఈఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యార్థులయ సీబీఎస్ సి హై స్కూల్ లో ఇన్వెస్టి చర్ పేరుతో నిర్వహించిన విద్యార్థి నాయకుల పదవి భాద్యతల స్వీకరణయోత్సవా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా విచ్చేసి మాట్లాడుతూ తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి స్కూల్ సిబ్బంది చక్కటి ప్రోత్సహాన్ని అందిస్తున్నారని, విద్యార్థులు వృద్ధి లోకి వచ్చి తల్లిదండ్రులకు, స్కూల్ కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ సూపరింటెండెంట్ శాంతిశ్రీ మాట్లాడుతూ జ్యోతి విద్యాలయకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, దాన్ని నిజం చేస్తూ విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్న అధ్యాపక బృందాన్నీ అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని ఆ దిశగా దూసుకుపోవాలని, అందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్యరూపకం ఆహూతులను అలరించింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం నవరత్నాలల్లో భాగమైన ఏమరాల్డ్, గార్నెట్, రూబీ, సఫైయర్ గ్రూపులను తయారు చేసి, లీడర్లను, క్యాప్తన్. లను ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, ఫాదర్ ఆంబ్రోస్ బెక్, సీనియర్ డిజిఎం, ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ, ఎస్టేట్ ఆఫీసర్ సురణ్ ప్రసాద్, డి జి ఎం లు శశికిరణ్, ఫణిదర్, సివిల్ మేనేజర్ మాయబ్రహ్మం, పి ఈ టి లు బాలు, వేణుగోపాల్, పూర్వ విద్యార్థులు బీచ్ వాలీబాల్ ఇండియన్ టీమ్ క్యాఫ్టన్ కృష్ణoరాజు, బాస్కెట్ బాల్ క్రీడాకారిణి పూర్ణిమ రాఘవేందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *