సంగారెడ్డి
తెలంగాణలో ఉన్న గౌడ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని గౌడ సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రంలోని గౌడ కులస్తులందరూకి తన వంతుగా సహాయ సాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని అయన తెలిపారు. బొల్లారం ప్రాంతం నుండి ‘ గౌడ సంఘం ‘ వైస్ ప్రెసిడెంట్ గా తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు . ఈ సందర్భంగా బొల్లారం యువకులు వైస్ ప్రెసిడెంట్ తిరుమణి శ్రీనివాస్ గౌడ్ ని కలిసి శాలువా తో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ గౌడ్, దీపక్, ప్రవీణ్, నగేష్ గౌడ్, గణేష్ గౌడ్, జావేద్, విజయ్ పాల్గొన్నారు.