ప్రభుత్వంలో ఉన్ననేతలు ధర్నాచేయడం హాస్యాస్పదం _బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్‌చెరు:

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధ‌ర్నాలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.టీఆర్ఎస్ నేత‌లు చేప‌ట్టిన దీక్ష‌ల్లో ఒక్క రైతు లేడ‌ని విమ‌ర్శించారు. ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేప‌ట్టిన ధర్నాలో కేవ‌లం గులాబీదళం మాత్ర‌మే ఉంద‌ని.రైతులు లేర‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పింది కానీ.కొనుగోలు చేయ‌మ‌ని చెప్ప‌లేద‌న్నారు.వడ్ల కొనుగోలు విషయంలో టీఆరఎస్ ప్ర‌భుత్వం అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తుందని బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగ‌డీల శ్రీకాంత్ గౌడ్  గ‌డీల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.

వ‌డ్ల కొనుగోలు విష‌యంలో ప్ర‌జ‌ల‌కు,రైతుల‌కు వాస్తవాలను తెలియ‌జేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు. రైతుల గురించి ధర్నా చేసే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏర్పాటు చేసిన మీ సొంత క్రషర్ మైనింగ్ ల వల్ల పంట పండించుకునే వీలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .ఈ విషయంపై గూడెం మ‌హిపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

బిజెపి నేత‌లు ధర్నాల‌కు దిగితే బీజేపీ నేత‌ల‌ను పోలీసులచే గృహ‌నిర్బంధం చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలకు దగ్గరుండి బందోబస్తు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, బండి నర్సింగ్ యాదవ్, కమాలకర్ రెడ్డి, దుర్గా సాయి, మల్క పురం సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *