Telangana

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా

తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు

మనవార్తలు ప్రతినిధి , అమీన్‌పూర్ :

అమీన్‌పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ మాజీ వైస్ ఎంపీపీ కోకల శ్రీనివాస్ నేతృత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. బీరంగూడలోని ప్రసిద్ధ శంభునిగుడి సమీపంలోని సర్వే నంబర్ 783లో సుమారు 20 గుంటలు, అలాగే సర్వే నంబర్ 767లో సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే అక్కడ ఆక్రమణలు బహిరంగంగా కనిపిస్తున్నాయని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమిని కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం కొరత ఏర్పడుతుందని వినతిపత్రంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సర్వే అధికారులతో సదరు సర్వే నంబర్లలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయాలని, అక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ వార్డు సభ్యులు సిహెచ్ లింగం గౌడ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి, అమీన్ పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

4 hours ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

4 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

1 day ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago