మనవార్తలు ,పటాన్ చెరు:
మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి భారీ విరాళం అందించారు.పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో సోమవారం నూతనంగా నిర్మించ తలపెట్టిన శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విగ్రహ ఏర్పాటుకు 1,50,000 రూపాయల విరాళం అందించారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో నియోజకవర్గ వ్యాప్తంగా శివాజీ విగ్రహాల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ మన్నే రాజు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు