పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి గారి నివాసంలో పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు గారి సహాయ సహకారాలతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరువు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, శ్రీధర్ చారీ, అశోక్, మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు.