పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నచ్చజెప్పడం అనేది ఒక కళ అని, మంచి మాటల ద్వారా ఎంతో ఒత్తిడికి లోనైన లేదా మానసిక రుగ్మతలతో బాధపడే వారికి కూడా స్వాంతన చేకూర్చవచ్చని హోప్ ట్రస్టుకు చెందిన మనస్తత్వవేత్త శివాని కోహ్లి అన్నారు. గీతం. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఆధ్వర్యంలో “వ్యసనాలను అర్థం చేసుకుని మార్చడం’ అనే అంశంపై సోమవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆమె ప్రధాన వక్తగా పాల్గొన్నారు.సెక్షాలజీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె నూట్లాడుతూ, ఆరోగ్యం, అభివృద్ధి, అర్థవంతమైన, మానసికరుగ్మతల నివారణకు నిర్వహించే స్వాంతన వృత్తిపరమైన కౌన్సెలింగ్ గా ఆమె అభివర్ణించారు. వర్తమానాన్ని ప్రభావితంచేసే గతానుభవాల నుంచి ఆలోచనలు, భావాలకు ఒక స్పష్టత తేవడానికి కౌన్సెలింగ్ సహాయపడుతుందన్నారు.

తీవ్రమైన ఆందోళనలకే కాక చిన్నపాటి ఉలికిపాటు ఉన్నవారికి కూడా అపోహలు, వాస్తవాలను వివరించి:నచ్చజెప్పవచ్చని కోహ్లి తెలిపారు. కౌన్సిలర్లతో ఆందోళనలను పంచుకోవడం బలహీనత కాదని ఆమె స్పష్టీకరించారు.ఒకరి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కూడా కొన్సెలింగ్ సహాపడుతుందన్నారు. ముందుగా, నూనసిక రుగ్మతతో బాధపడేవారి ప్రవర్తనను తెలుసుకుని, వారిని మార్చడానికి ప్రయత్నించాలని శివాని సూచించారు.

తొలుత, గీతం యోగ్యతా భివృద్ధి బృందం (కాంపిటెన్స్ డెవల మెంట్ టీమ్) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాల లక్ష్యాలు, దాని ప్రాముఖ్యతలను నిర్వాహకురాలు డాక్టర్ రూత్ జెన్ హోజెల్ వివరించారు. కెరీర్ ఫుల్ ఫెల్మెంట్ అధికారి డాక్టర్ రమాకాంత్ బాల్ అతిథిని స్వాగతించారు. యోగ్యతాభివృద్ధి బృందం సంచాలకుడు డాక్టర్ రొజీనా మాథ్యూ, జీసీజీసీ సంచాలకుడు డాక్టర్ నాతి వేణుకుమార్ పర్యవేక్షణలో ఈ కార్యశాలను నిర్వహించారు.
