మనవార్తలు , శేరిలింగంపల్లి :
జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో జి వై ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. చలితీవ్రత రాష్ట్రవ్యాప్తంగా పెరిగిందని, చలి నుండి రక్షణ కొరకు వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని ఆయన సూచించారు.
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని. విద్యార్థులు చిన్నతనం నుండే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మీ కుటుంబాల్లో, బంధువుల్లో ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించాన్నారని అయన అన్నారు.ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం మాణిభూషణ్, రామరాజు, విజిత్, ట్టప్ప రఘు, సంతోష్, రాహుల్, శివాజీ, రంజిత్, రమేష్, తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.