Hyderabad

సంతానలేమితో బాధపడుతున్న వారికి శుభవార్త – నగర మేయర్ విజయలక్ష్మి

మనవార్తలు, శేరిలింగంపల్లి :

సంతాన లేమితో బాధపడుతున్న వారికోసo ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ టుడే అన్న నినాదంతో ఈ సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో రెయిన్ బో చిల్డ్రన్స్ క్లినిక్ దగ్గర నెలకొల్పిన ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ ను గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అఖిల రెడ్డి, ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల తో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటి ప్రపంచంలో ప్రతీ ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది.

ఆహారపు అలవాట్లు, తినే సమయం, లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయాయి. ఇవన్నీ మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సంతానలేమికి కారణం అవుతున్నాయి. అలాంటి దంపతులకు ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ పరిష్కారం చూపిస్తుందని అన్నారు.

అత్యాధునిక సాంకేతిక, ఆధునిక సదుపాయాలు ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్ మరియు ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నాయి. బెస్ట్ ఎక్విప్ మెంట్, మోడరన్ టెక్నిక్స్ ఉపయోగించి ఇందులో ట్రీట్ మెంట్ అందిస్తారు. టెస్టులకు సంబంధించి కచ్చితమైన, అత్యంత నమ్మకమైన సమాచారం పొందవచ్చు. అంతే కాకుండా అపార అనుభవం కలిగిన వైద్యుల ఆధ్వర్యంలో సెంటర్ నడుస్తోందని, సంతాన లేమితో బాధపడుతున్న వారి పాలిట వరంగా నిలుస్తోందని తెలిపారు. ఫెలిసిటీ ఐ.వి.ఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలకు www.felicityivf.com వెబ్ సైట్ లేదా 040-48563366, 8953535375/76 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

4 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

4 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

4 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

2 weeks ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

2 weeks ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

2 weeks ago