– గీతమ్ నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో డాక్టర్ డయానా
మనవార్తలు ,పటాన్ చెరు:
ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని , బాగా నిద్రపోవాలని , కనీస శారీరక వ్యాయామం చేయాలని , సమాజంతో కలగలిసి పోవాలని , మద్యం / మాదకద్యవ్యాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ సెక్షాలజిస్టు , హెదరాబాద్ అకాడమీ ఆఫ్ సెక్షాలజీ వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ డయానా మోంటెరో అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎసాచ్ఎస్ ) లోని మానసిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో ఒక వక్తగా ఆమె ప్రసంగించారు . ‘ అందరికీ మానసిక ఆరోగ్యం , శ్రేయస్సును అందించడం ‘ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , ప్రవర్తన , ఆలోచన , భావాలను బట్టి మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుందన్నారు . ఆశావాదులు ఎక్కువ కాలం జీవించగలరని , కాబట్టి ప్రతి ఒక్కరూ మరింత ఆరోగ్యకరమైన ప్రవర్తనతో మెలగాలని ఆమె సూచించారు .
ఇతరులతో మంచి స్నేహం , సంబంధాలు , సంతృప్తికర కళాశాల జీవనం , మనతో మనం నిరంతరం అనుసంధానం కలిగి ఉండడం మంచిదని డాక్టర్ డయానా హితవు పలికారు . ఏకాగ్రత కోల్పోవడం , ప్రతికూలత , ఆకలి / నిద్ర / మానసిక స్థితిలో మార్పు , పదార్థ దుర్వినియోగం , అస్తవ్యస్తత , ఒంటరిగా ఉండడం , ఒత్తిడికి గురవడం , స్వీయ విధ్వంసక ప్రవర్తనలు అసమతుల్య మానసిక ఆరోగ్యానికి హెచ్చరిక సంకేతాలని డాక్టర్ డయానా వివరించారు . ఫ్రీలాన్స్ ట్రాఫిక్ సెక్షాలజిస్టు అనఘ ‘ మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలను గుర్తించడం ‘ అనే అంశంపై ఎక్స్ప్రెషనిస్ట్ డ్యాన్సర్ పి.చిదానంద శాస్త్రి ‘ ఔషధాలను వినియోగించి మానసిక కృంగుబాటును అధిగమించడం ‘ అనే అంశంపై ఉపన్యసించారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలకు వారు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు . తొలుత కార్యక్రమ నిర్వాహకురాలు మానసిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ అతిథులను పరిచయం చేయగా , విశిష్ట ఆచార్యుడు డాక్టర్ జీని రామారావు వారిని సత్కరించారు .