విజేతలకు బహుమతులు అందజేసిన గూడెం విక్రమ్ రెడ్డి
అమీన్పూర్:
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంచుతాయని టిఆర్ఎస్ యువ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రారంభించిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విక్రమ్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడల పై దృష్టి సారించాలని సూచించారు. జి ఎం ఆర్ ఫౌండేషన్ ద్వారా క్రీడా పోటీలు నిర్వహిస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు రుశ్వంత్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

