గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

Hyderabad Telangana

పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మశీ, స్కూల్ ఆఫ్ సైన్స్ లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీ లింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్ లో ప్రాంగణ నియామకాలను నిర్వహించి, 803 మంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, ఎంబీఏ, బీ.ఫార్మశీ, బీఎస్బీ, ఎమ్మెస్సీ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. 197 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్టు తెలిపారు.

వర్పూషా (ఇంటర్నేషనల్) ఇద్దరు గీతం విద్యార్ధులను 45 వేల అమెరికన్ డాలర్ల వార్షిక వేతనంతో ఎంపిక చేయగా, మ్యూసిగ్మా ఎనిమిది మంది గీతం విద్యార్థులను నాలుగేళ్ళకు రూ.30 లక్షల వేతనంతో ఎంపిక చేసింది. కాగా, ఫెడరల్ బ్యాంక్ రూ.12 లక్షల వార్షిక వేతనం, బైజూస్ రూ.10 లక్షలు, ఆప్ గ్రాడ్ రూ.8 లక్షలు, ఓపెన్ రూ.7.25 లక్షలు, ఆప్టమ్ రూ.7.15 లక్షలు, టీసీఎస్ డిజిటల్, విలే మైత్రీ, డెల్ టెక్నాలజీలు రూ. 7 లక్షల చొప్పున, జొమొసొ టెక్నాలజీస్ రూ.6.89 లక్షలు, హిటాచీ కన్సల్టింగ్, క్లౌడ్ ధింగ్ర్లు రూ.6.5 లక్షల చొప్పున, కొలిన్స్ ఏరోస్పేస్ రూ.6.25 లక్షలు, కాల్ హెల్త్, టెక్ సిస్టమ్స్ రూ. 6 లక్షల చొప్పున, మొడెక్ అనలిటిక్స్ రూ.5.5 లక్షలు, ఇంటెల్లీపాట్ రూ.5.8 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు.

దాదాపు 25 కుపెనీలు ఐదు లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేసినట్టు వెల్లడించారు. బీబీఏ, బీఎస్సీ విద్యార్థులు కూడా పది లక్షల రూపాయల గరిష్ట వార్షిక వేతనంతో ఎంపికైనట్టు తెలిపారు. భారతీయ బహుళజాతి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 200 మంది గీతం హైదరాబాద్ విద్యార్ధులను ప్రాంగణ నియామకాలలో ఎంపిక చేయగా, వాల్యూమొమెంటమ్ 87 మందిని, మైండ్ ట్రీ 75, విప్రో 33, ఎసెంచ్యూర్ 31, హెక్సావేర్ 28, టాటా టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంకు ఒక్కొక్కటీ 26 మంది చొప్పున, విడ్డ ల్యాబ్స్ 23, అప్ గ్రాడ్ 22, వర్చూషా 19, ఓపెన్ టెక్ట్, టీఏ డిజిటల్ లు ఒక్కొక్కటీ 11 మంది చొప్పున, ఫేస్ 12, ఏవోసిస్ 10, బార్నె ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫార్, జయల్, నాల్ సాఫ్ట్ లు ఒక్కొక్కటీ తొమ్మిది మంది చొప్పున, క్లయింబర్, కొలిన్స్ ఏరోస్పేస్, మ్యూసిగ్మా, పీకే గ్లోబల్, ప్రొలిఫిలు ఒక్కొక్కటీ ఎనిమిది మంది చొప్పున గీతం హైదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాలలో ఎంపిక చేసినట్టు గీతం అధికారులు తెలిపారు.

 

ఇవేకాక, శాడల్ పాయింట్, వసుదైక సాఫ్ట్వేర్, గ్లోబల్ ఎడ్జ్, ఫాక్ట్ సెట్, సీటీఎస్, ఏషియన్ పెయింట్స్, ఎంఆర్ఎఫ్, యాక్సిస్ బ్యాంక్, ఇన్వెస్కో కంట్రోల్ ఎస్, డెల్లాయిట్ వంటి పలు పేరొందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అచీవర్స్ డే ముఖ్య అతిథిగా టెక్చువా సీఈవో శ్రావణ్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నియామక ఉత్తర్వులు అందజేస్తూ, విజేతలను అభినందించారు. ఈ విజయం విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వృత్తిపర నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడుతుందని చెప్పారు. సభాధ్యక్షత వహించిన గీతం ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ, తమ విద్యార్థులు చేన కృషి గీతం అందించిన నాణ్యమైన విద్య, కెరీర్ గైడెన్స్ విభాగంతో పాటు అధ్యాపకుల ఆలు పెరగని శ్రమ, సమష్టి కృషి ఈ ప్రాంగణ నియామక ఫలితాల్లో ప్రతిబింబిస్తున్నాయన్నారు.

మేనేజ్ మెంట్ విద్యార్థుల ప్రాంగణ నియామకాలపై జీహెచ్ బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకు, ఫార్మశీ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ సైన్స్ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావులు విడివిడిగా నివేదికలు సమర్పించారు. గీతం కెరీర్ గైడెన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ స్వాగతోపన్యాసం చేయగా, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అక్కలక్ష్మి వందన సమర్పణ చేశారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ , రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, వివిధ విభాగాధిపతులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *