– విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత
– వెయ్యి మంది విద్యార్థులను ఎంపిక చేసిన 230 కంపెనీలు
– 300 మందికి ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు
– 150 మందిని ఎంపిక చేసిన విప్రో ఎలైట్
మనవార్తలు,పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెల్ గురువారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికపై ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలతో పాటు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశ పత్రాలను అందజేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో దాదాపు 230 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతం ప్రాంగణ నియామకాలను నిర్వహించి, వెయ్యి మంది బీటెక్, ఎంటెక్, బీబీఏ, బీకాం, ఎంబీఏ, బీ.ఫార్మశీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ విద్యార్థులను ఎంపిక చేసినట్టు గీతం వర్గాలు ప్రకటించాయి. దాదాపు 300 మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. కొంతమంది విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని ప్రవేశార్హత సాధించారన్నారు. టెక్సాస్ విశ్వవిద్యాలయం, టెక్సాస్ ఏఅండ్ఎం, మసాచుసెట్స్, మెంఫిన్, ఐఐఎం బెంగళూరు వంటి ప్రముఖ సంస్థలలో ఆయా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు తెలియజేశారు.

ఇప్పటివరకు దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఐటీ సేవలతో పాటు పలు బహుళజాతి కంపెనీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో ఉద్యోగాలు పొందినట్టు చెప్పారు. మేనేజ్మెంట్ విద్యార్థులు రూ.12.56 లక్షల గరిష్ట వార్షిక వేతనం, సైన్స్ విద్యార్థులు రూ.7.5 లక్షలు, ఫార్మసీ విద్యార్థులు రూ.3 లక్షల గిరిష్ట వార్షిక వేతనాలకు ఎంపికైనట్టు తెలిపారు. వర్చూషా (ఇంటర్నేషనల్) ఇద్దరు గీతం విద్యార్థులను 45 వేది అమెరికన్ డాలర్ల వార్షిక వేతనంతో ఎంపిక చేయగా, పెగా సిస్టమ్స్ రూ.16 లక్షలు, ఫెడరల్ బ్యాంక్ రూ.12.5 లక్షలు, సిలిగో రూ.11 లక్షలు, ఎంటిఎక్స్ రూ.10.4 లక్షలు, అమేడియస్ రూ.9.3 లక్షలు, ఇంటెల్లిపాల్ రూ.9 లక్షలు, డీబీఎస్ రూ.1.5 లక్షలు, అకోలెట్టి డిజిటల్ రూ.1.4 లక్షలు, ఈఏ & ఆప్ గ్రేడ్ ఒక్కొక్కటి రూ.8 లక్షల వార్షిక వేతనాలను గీతం, హైదరాబాద్ విద్యార్థులకు ఆఫర్ చేసినట్టు వెల్లడించారు. ఇవేకాక దాదాపు 36 కంపెనీలు రూ.5 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేశాయన్నారు. మొత్తంమీద రూ.5 లక్షల సగటు వార్షిక నేతనాన్ని గీతం విద్యార్థులు పొందినట్టు తెలిపారు. కోఫోర్ట్, గ్రాన్యూల్స్ ఇండియా, ఏఎన్ జెడ్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, టర్నింగ్ మైండ్స్, హైరేడియేషస్, ఎంఎస్ఎన్ లేబొరేటరీస్, గ్రౌండ్ ఫార్మా, రెయిన్ బో హాస్పటల్ వంటి పలు సంస్థలు ఈ ఏడాది నుంచి గీతంలో నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నారు.


గీతం హైదరాబాద్ ప్రాంగణం నుంచి విప్రో ఎలైట్ 150 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, టీసీఎస్ 118, ప్రొడాప్ట్ 88, వాల్యూమొమెంటం 72, ఎసెంచ్యూర్ 66, మెంట్లై 33, మ్యూసిగ్మా 25, కోఫోర్జ 23, ఈ ఎన్ హైసెక్యూర్ 13, టెక్ సిస్టమ్స్ 10, విన్ వెల్ష్ – బి సాఫ్ట్ ఒక్కొక్కటీ తొమ్మిది మంది చొప్పున, అమేడియస్ ఏడుగురు, వెన్లీవ్స్, సిలిగో, బోష్ ఒక్కొక్కటి ఆరుగురు చొప్పున చేసి డిజిబల్, ఆస్టమ్, ఈమె బ్రీడీఎస్ లు ఒక్కొక్కటి ఐదుగురు చొప్పున, జెనోటి, క్లోరియంట్ నెబ్యులా, ఎసీజీ ఓవర్సీస్, డీబీఎస్ లు ఒక్కొక్కటీ నలుగురు చొప్పున, విశ్లే – మత్రీ, టిటాఘర్ వ్యాగన్స్, పీకే గ్లోబల్ ఎనీటి డేటా, నారాఫ్ట్, ఎంటీఎక్స్, ఇన్వెస్కో, హెచ్ సీఎల్, కాగ్నిటివ్ బోటిక్స్, అకోలెట్టి డిజిటల్ ఒక్కొక్కటి ముగ్గురు చొప్పున, వొడాఫోన్ ఐడియా, నెమ్ టెక్నాలజీస్, ఆప్‌గ్రేడ్, ట్యూరింగ్ మెండ్స్, దిమిటెక్, హర్మాన్ చెక్ కేకా, కెగా ఫేస్, క్యాన్ జెమినీ స్టీన్లు ఒక్కొక్కటీ ఇద్దరు చొప్పున గీతం హైదరాబాద్ విద్యార్థులను ప్రాంగణ నియామకాలలో ఎంపిక చేశాయన్నారు.

ఇవేకాక టెక్ మహీంద్రా, బాబా టెక్నాలజీస్, పర్సిస్టెంట్, పెన్నార్ ఇండస్ట్రీస్, ఓమ్నీక్లౌడ్, కార్ బటాలిన్, ఇన్ఫోసిస్, హిటాచీ పంతారా, ఈవమ్, డెక్స్, బెస్, బీఎస్సీ పరిస్, ఎటొస్ వంటి పలు పేరొందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. ‘అచీవర్స్ డే’ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆరాజెన్ లెఫ్ట్ సైన్స్ (జీవీకే బయో) మానవ వనరుల శాఖాధిపతి డాక్టర్ శ్రీనివాస్ పుష్పాల విద్యార్థులకు నియామక ఉత్తర్వులు అందజేస్తూ, విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలవాలనే సంకల్పం, విజయం సాధించాలనే తపన, పూర్తి సామర్థ్యానికి చేరుకోవాలనే ఆరాటం ప్రగతికి బాటలు వేస్తాయన్నారు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అద్వితీయమైన కృషి చేస్తున్న అధ్యాపకులను గీతం హైదరాబాద్ అదరవు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ అభినందించారు. స్పష్టమైన లక్ష్యం లేదా లక్ష్యాలు ఉన్న వ్యక్తులు తమ గమ్యాన్ని గుర్తెరిగి, విజయం సాధిస్తారని ఉద్ఘాటించారు. మేనేజ్మెంట్ విద్యార్థుల ప్రాంగణ నియామకాలపై జీహెచ్ బీఎస్ డీన్ అండ్ డెరెక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్, ఫార్మశీ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్, సెర్చ్ నియామకాలపై ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావులు విడివిడిగా నివేదికలు సమర్పించారు. గీతం కెరీర్ గైడెన్స్ విభాగం డెరెక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ స్వాగతోపన్యాసం చేయగా, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అక్కలక్ష్మీ వందన సమర్పణ చేశారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, వివిధ విభాగాధిపతులు, వివిధ కంపెనీలకు ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
