కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశమివ్వండి…
– బిజెపి నాయకులు బలరాం
పటాన్ చెరు:
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని బీజీపీ నాయకులు బలరాం అన్నారు.శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ…
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 4 లక్షల 46 వేల 169 దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులివ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు.
అదే విధంగా దరఖాస్తు చేసుకోని వారికీ అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు. చాలా మంది పేదలు రేషన్ కార్డులు లేక బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు నిత్యావసర సరుకులు కొంటూ నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించి రేషన్ కార్డులు అందించాలని బిజెపి నాయకులు బలరాం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.