సీఏఎంఏపీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు వివరించారు. వారు ప్రధానంగా నిమ్మగడ్డి, సిట్రోనెల్లా, నెటినర్ గడ్డి, అశ్వగంధ, సెన్నా, కర్నేస్, మెంత,సరస్వతి, బ్రాహ్మి, గిలోయ్, మలబార్ నట్, రేవోల్సియా వంటి పలు ఔషధ మొక్కల విశేషాలు, వారి ప్రాముఖ్యతలనుతెలియజేశారు. తమ తోటలో పెరుగుతున్న మొక్కల జాతులు, వన మూలికలు, తీగలు, వాటిని పెంచే పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ జ్ఞానేశ విద్యార్థులకు వివరించారు.

సీఐఎంఏసీ ప్రయోగశాలల్లోని ఆధునిక పరికరాలు, క్లీనెంజర్ ఉపకరణం, సాక్స్ట్ ఎక్స్ ట్రాక్టర్, గ్యాస్ -క్రోమాటోగ్రఫీ, మాస్ స్పెక్ట్రోస్కోపీ (జీఎస్-ఎంఎస్), హె-ఫెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీ ఎస్సీ), సుగంధ నూనెలను వెలికితీసే సాంకేతికతల గురించి మరో శాస్త్రవేత్త డాక్టర్ సత్య శ్రీనివాస్ విశదీకరించారు. కాగా, డిస్టిలేషన్ యూనిట్ల గురించి, సుగంధ మొక్కల నుంచి నూనె వెలికితీసే వివిధ పద్ధతులను శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ బాబు. తెలియజేశారు.ఫార్మసీ విద్యార్థులు శాస్త్రవేర్తలను అడిగి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఫార్మసీ అధ్యాపకులు. డాక్టర్ విన్యాస్, డాక్టర్ జితేంద్ర పటేల్ తదితరులు శాస్త్రవేత్తలతో సంభాషించారు. వారికి కృతజ్ఞతా పూర్వ జ్ఞాపికను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *