డేటా ఇంజనీరింగ్ పై గీతమ్ అంతర్జాతీయ సదస్సు

Telangana

_పేర్ల నమోదుకు తుది గడువు: అక్టోబర్ 15

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. ‘డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దీనిని నిర్వహించ సున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా సిస్ట్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సుస్థిరత విజ్ఞాన ఆధారిత నిపుణుల వ్యవస్థలపై ఆలోచనలు, కొత్త సరిశోధనల్లోని అంతర్గత అంశాలను పంచుకోవడానికి విశ్వవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, విద్యావేత్తలకు ఒక అంతర్జాతీయ వేదికను అందించడం ఈ సదస్సు లక్ష్యంగా పేర్కొన్నారు.ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొంటున్నారని, నార్త్ ఫ్లోరిడా:విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అసెంబి; లాస్ వేగాస్లోని నెవడా వర్సిటీ ఆచార్యులు ప్రొఫెసర్ హెన్రీ సిల్వరాజ్, ప్రొఫెసర్:లక్ష్మీ గేవాలిలు; చెనా, చెంగ్డులోని ఎలక్ట్రానిక్స్ సెన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీ ప్రొఫెసర్ ఆసిఫ్ ఖాన్, మలేసియాలోనిచాటింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టి. నందకుమార్తో పాటు న్యూయార్క్ లోని ఐటీఎం మేనేజర్గణేశన్ నారాయణస్వామి తదితరులు తను అనుభవాలను పంచుకుంటారని ఆ ప్రకటనలో వివరించారు. సైద్ధాంతిక ఆవరణాత్మక ప్రయోగాత్మక డొమెన్లతో సహా అన్ని ఇతర రంగాల నుంచి పరిశోధన పత్రాలను ఈ సదస్సులో సమర్పించవచ్చని, ఎంపిక చేసిన పత్రాలను ప్రింగర్ ప్రొసీడింగ్స్ పుస్తకంగా ప్రచురిస్తామని తెలిపారు.

ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు. అక్టోబర్ 15వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్వర్గీకరించారు. పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం +91 96201 60306ని సంప్రదించాలని లేదా Icdermi2023@gitam.in కు ఈ-మెయిల్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *