ఘనంగా ముదిరాజ్ సంఘం ఆవిర్భావ వేడుకలు

Districts Telangana

రెగోడ్, మనవార్తలు :

హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వెనుకబడిన కులాల అభివృద్ధిలో భాగంగా 1922 లో వ్యవష్టాపక అధ్యక్షులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్ ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీర్తి శేషులు నవాడ ముత్తయ్య ముదిరాజ్ 89 వ దసరా సమ్మేళనం లో బాగానే ఈ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

అప్పటి ముదిరాజ్ ముద్దుబిడ్డలు, ధీరులు కీర్తిశేషులు కోరవి కృష్ణ స్వామి ముదిరాజ్, సవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ లు ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటు చేసి ముదిరాజ్ ల ఐక్యతకు, ఎదుగుదలకు పాటుపడిన ధీరులు. వారి ఆశయ సాధనకై ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, జెడ్ పి చైర్మన్ కాశాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని పిలుపు నివ్వవడo తో ఆదివారం రోజూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ టాకీ టౌన్ చౌరస్తా వద్ద శే

రిలింగంపల్లి నియోజకవర్గo ముదిరాజ్ సంఘం కన్వీనర్ బి. అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసి వారికి నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో. విట్టలయ్య, గోపాల్, మన్నే సురేష్, బి.శ్రీనివాస్, గుండె గణేష్, ఆకుల రమేష్, రాములు, లక్ష్మణ్, మన్నే ప్రసాద్, నర్సింగ్ రావ్, కె. ప్రభాకర్, శ్రీనివాస్ రాజ్, శివరాజ్, జి. శ్రీశైలం, బి. అనిల్, మన్నే చంద్రయ్య పాపయ్య తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *