భారత్ ను సూపర్ పవర్ మార్చేందుకు సిద్ధం కండి’

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

భారతదేశాన్ని సూపర్ పవర్ మార్చడానికి యువత వారి శక్తియుక్తులను ఉపయోగించడానికి ముందుకు రావాలని పంజాబ్ మొహాలిలోని నెస్టర్ ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ మాజీ డీన్, ప్రొఫెసర్ సరంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో “పర్పూట్ ఫర్ ఇన్స్ఫెర్డ్ కెరీర్ ఇన్ ఫార్మా సెక్టార్’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు కార్యశాలలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు.ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన ఆవశ్యకత, మూస ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉండడం గురించి. ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఉన్నత జీవితానికి బాటలువేసే పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలతో పాటు, సెంటిఫిక్ కెరీర్లను ఎంచుకోవాలని సూచించారు.

విశ్వవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ ఉద్యోగాలు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సలహా ఇచ్చారు. విద్యార్థులు తమ కెరీర్లో రాణించేందుకు మంచి భావ ప్రకటనా నైపుణ్యాలు, క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ వినూత్న ఆలోచనలకు రూపునిచ్చి వ్యవస్థాపకులుగా ఎదగాలని ఉద్బోధించారు. ప్రపంచంలో వినియోగించే ప్రతి మూడో మాత్ర (టాబ్లెట్) భారతీదేనని గర్వంగా చెబుతూ, ఫార్మా, ఆర్యోగానికి సంబంధించిన భవిష్య సాంకేతికతలలో ప్రతి మూడవ నిపుణుడు కూడా భారతదేశానికి చెందినవారే ఉంటారని ఆయన అంచనా వేశారు. విద్యార్థులు స్టార్టప్ సంస్కృతిని అలవరచుకోవాలని, పరిశ్రమలోని ప్రత్యేక అవకాశాలను అన్వేషించాలని డాక్టర్ రంజిత్ సూచించారు.

ప్రస్తుతం నయం చేయలేని వ్యాధులను నివారించడానికి, లేదా నయం చేయడానికి కొత్త ఔషధాలను అభివృ ద్ధి చేయడంలో ఉన్న సవాళ్లను ఆయన వివరించారు. ఔషధ పరిశోధన, అభివృద్ధితో కృత్రిమ మేథ కీలక భూమిక పోషిస్తోందని, ఇది కొత్త ఔషధ లక్ష్యాలను గుర్తించడం, ధృవీకరించడం, భద్రత, సమర్థత అంచనాలను మెరుగు పరచడంలో సహాయపడుతుందని ప్రొఫెసర్ సరంజిత్ పేర్కొన్నారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు.తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.ఎస్ కుమార్ అతిథిని స్వాగతించి, సత్కరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.సామా వందన సమర్పణతో ఈ కార్యశాల ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *