మనవార్తలు ,రామచంద్రపురం
మానసిక ఆధ్యాత్మిక కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది అని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం లోని తన నివాసంలో వివిధ రకాల యెగా ఆసనాలూ వేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా విశ్వవ్యాప్తంగా జూన్ 21 వ తేదీన యోగా కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమని అన్నారు .ప్రస్తుతం యోగా ప్రపంచ నలుమూలలకు విస్తరించింది అని ,ప్రతి ఒక్కరూ తమ దినచర్య లో భాగంగా యోగ చేయాలని దీనివల్ల మానసిక ,శారీరక ఉల్లాసం కలుగుతుంది అని . అంతేకాకుండా మానసిక ఆధ్యాత్మిక కల్పించడమే ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు రోజువారీగా యోగాసనాలు చేస్తూ తమ జీవితాలను ఆనందంగా గడిపాలని మానసిక ఉల్లాసానికి. మానసిక ఆరోగ్యం దిశగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు బలరాం సూచించారు.