గీతం పూర్వవిద్యార్థి సుభాష్కు ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డు…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి , ఫీనిక్స్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుభాష్ కాకర్ల బిజినెస్ మింట్ నుంచి 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రావేత్తల కేటగిరీలో ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డును అందుకున్నారు . గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి ( 2013-17 ) పట్టభద్రుడైన సుభాష్ ఐఐఎం రాంచీలో పీజీ ( ఎంబీఏ ) పూర్తిచేసి , అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నారు . ఈ నేపథ్యంలో మింటు దేశవ్యాప్తంగా 800 కంటే ఎక్కువ నామినేషన్లు రాగా , వాటి నుంచి సుభాష్ను ఎంపిక చేయడం విశేషం . సుభాష్ ప్రపంచ ప్రసిద్ధ గోల్డ్మన్ సాక్స్ , ఫ్యాక్ట్సట్లలో కొంతకాలం పనిచేశారు . ఆయన వెలువరించిన ఆర్థిక , విశ్లేషణాత్మక పరిశోధనా పత్రాలు ప్రసిద్ధ పత్రికలలో ప్రచురితమయ్యాయి .

విశ్వవిద్యాలయంలో చూపిన ప్రతిభకు మెరిట్ మెడల్తో పాటు సంపూర్ణ పరిణితి సాధించిన విద్యార్థిగా రెండు బంగారు పతకాలను , ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు . గ్రామీణ నెపుణ్యాభివృద్ధి , విద్యపై చాలా మక్కువగల సుభాష్ హెదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంధ సంస్థకు అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు . మనదేశంలో ప్రతిభ పుష్కలంగా ఉందని , నేటి వ్యాపారవేత్తల నెపుణ్యం , అనుభవాన్ని పరిరక్షిస్తూ ప్రపంచ భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడే వర్థమాన తారలను ఆకర్షించడమే వ్యాపారాల లక్ష్యమని బిజినెస్ మింట్ వ్యవస్థాపకుడు వినయ్ కాంత్ కొరపాటి ఈ అవార్డు ప్రకటన సందర్భంగా వ్యాఖ్యానించారు .

చిరు ప్రాయంలోనే జాతీయస్థాయిలో ప్రకటించే అవార్డును అందుకున్న సుభాషన్ను గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *