గీతమ్ సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్….

politics Telangana

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి :

గీతం, హెదరాబాద్ లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు ‘సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గీతమ్ లోని ఈ-క్లబ్, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్, కార్యక్రము నిర్వాహకుడు వాసుదేవ్ వంగర శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.పర్స్పెక్ట్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జిగ్నేష్ తలసిల, పాలిగాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్ పిన్నమనేనిలు మే 26న ‘ఎంటర్ప్రైన్యూర్ టాక్ ‘తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన వెల్లడించారు.

శనివారం ‘డిజెన్ థింకింగ్ వర్క్షాప్’ను వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్ యామిని కృష్ణ రాపేటితో కలిసి తాను నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఇక సెలవురోజైన ఆదివారం ‘వెంచర్ ఫారెస్ట్ ట్రైల్స్’ పేరిట ఓ ఉత్తేజకరమైన ఫీల్డ్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.అదానీ పోర్ట్, సెజ్ ఇన్నోవేషన్ మేనేజర్ సుబ్రమణియన్ నాడార్, ఎక్స్పోజిట్ ఇమ్మర్సివ్ సొల్యూషన్ వ్యవస్థాపకుడు, ఎండీ రోషన్ రావల్లు సోమవారం ‘కార్పొరేట్ కనెక్ట్ అండ్ స్టార్టప్ సిమ్యులేటర్’పై మార్గదర్శకత్వాన్ని అందిస్తారని నిర్వాహకుడు వాసుదేవ్ వివరించారు.

విజ్డేల్ వ్యవస్థాపకుడు కృతీష్ కుమార్ మే 29న ‘ఎంటర్ప్రైన్యూర్ టాక్’ను అందిస్తారన్నారు. బుధవారం ‘ఆర్ఎస్ఓ వర్క్షాప్’లో ప్రధాన వక్తగా ఎన్-ఐడియా ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ కునాల్ గిర్ వ్యవహరిస్తారని తెలిపారు. మెక్రోసాఫ్ట్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ చైతన్య ముప్పాలా మే 31న ‘కృత్రిమ మేథ భవిత, ఉత్పత్తి అభివృద్ధి మెళకువల’పై ప్రసంగిస్తారన్నారు. ఈ ఆరు రోజుల సమ్మర్ స్టార్టప్ స్కూల్ బుధవారం ‘ఇంక్యుబేటర్ ఫీల్డ్ విజిట్’తో ముగుస్తుందని వాసుదేవ వంగర వివరించారు.ఇతరత్రా సమాచారం కోసం తనను 97038 31819ను కానీ, లేదా పార్థసారథి 78932 78734ని సంప్రదించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *