Telangana

డీఈఎస్ను సందర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయంతో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సెర్చ్: విద్యార్థులు గురువారం ఖైరతాబాద్ (హెదరాబాద్ )లోని చెరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్)ను సందర్శించారు. గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు మార్గదర్శనంలో, డాక్టర్ శివారెడ్డి తేరి, డాక్టర్ పి.నరసింహ స్వామిల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 60 నుండి విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఎస్. డెరెక్టర్ జి.దయానందం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, తమ సంస్థ ప్రభుత్వానికి అందిస్తున్న సేవలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక రంగాలలో మార్గనిర్దేశనం చేయడానికి, వారి అవసరాలు తీర్చడానికి క్రమబద్ధమైన విషయ సేకరణ, సంకలనం, విశ్లేషణ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అవసరాలను బట్టి డెరెక్టరేట్ తాత్కాలిక అధ్యయనాలను నిర్వహిస్తోందన్నారు. వీటితో పాటు జనాభా వివరాలు, ఆరోగ్యం, వర్షపాతం, పశుసంవర్ధక సేవలు, రాష్ట్ర ఆదాయం, పరిశ్రమలు, విద్యుత్ వినియోగం, రవాణా, బ్యాంకులు, విద్య, ప్రజా పంపిణీ వంటి పలు సేవలను కూడా డీఈఎస్ అందిస్తున్నట్లు చెరెక్టర్ వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సంస్థ (టీఎస్డీపీఎస్) ఈచో ఎ. రామకృష్ణ, నాగరాజు, డీఈఎస్ డీఎస్ భారతి, టార్క్ ఏడీజీ జి.శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా గీతం విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు.

 

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

21 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

21 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

21 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

21 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago