పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపత్లో నిర్వహించే కవాతులో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నిర్వహించే ముందస్తు క్యాంపుకు హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి గౌరంగో జెనా ఎంపికయ్యారు . గుజరాత్లోని ఆనంద్ జిల్లా సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో ఈనెల 20-28వ తేదీ వరకు జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్లో జెనా పాల్గొంటారని గీతం ఎన్ఎన్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ఈ క్యాంపులో భాగంగా నిర్వహించనున్న ఎగ్జిబిషన్లో యాక్షన్ ఫొటోలు , బ్యానర్లు , చార్టులు , ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల నివేదికలు , నిర్వహించిన ప్రాజెక్టులు వంటివాటిని ప్రదర్శించడంతో పాటు కవాతు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో కూడా శిక్షణ ఇస్తారని ఆయన వివరించారు . దేశం నలుమూలల నుంచి పాల్గొనే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లలో 200 మంది అత్యుత్తమ ప్రతిభావంతులను గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎంపిక చేస్తారని డాక్టర్ నాగేంద్రకుమార్ తెలియజేశారు .