గీతం విద్యార్థినికి 30 కి పైగా విద్యా సంస్థలలో సీట్లు…

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ , సీఎస్ఈ విద్యార్థిని మేఘన రెడ్డి కొల్లికి 2022-24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు చదవమని కోరుతూ దేశవ్యాప్తంగా ఉన్న 30 కి పెగ్జా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపాయి . ఐఐఎం ఇండోర్ , కాశీపూర్ , అమృత్సర్ , బుద్ధగయ , సంబలూర్ , సిర్మౌర్ , జమ్మూ ; ఎండీఐ గుర్గావ్ , ఐఐటీ ధన్బాద్ – జోధ్పూర్ ; ఐఎంటీ ఘజియాబాద్ , నాగపూర్ , హెదరాబాద్ ; ఐఎంఐ ఢిల్లీ , కోల్ కతా , భువనేశ్వర్ ; ఎస్పీజేఐఎంఆర్ ముంబై నార్సిమోంజీ ముంబై మాస్టర్స్ యూనియన్ , గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చెన్నయ్ , గుర్గావ్ ; నల్సార్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ – ఢిల్లీ విశ్వవిద్యాలయాలు తమ విద్యా సంస్థలలో చేరమని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు .

విద్యలో మెరుగ్గా ఉండి తొమ్మిది సీజీపీఏ ( 90 శాతానికి పైగా మార్కులు ) సాధించడమే గాక దాదాపు పదికి పెగ్జా గీతమ్ క్లబ్లు , ప్రత్యేక ఆసక్తి సమూహాలలో భాగం కావడం ద్వారా పాఠ్యేతర కార్యకలాపాలను మేఘన సమతుల్యం చేసినట్టు తెలిపారు . గీతమ్ నిర్వహించే పలు ఉత్సవాలు , కార్యకలాపాలలో ( కళలు , వ్యాసరచన , వంట , డ్యాన్సు వంటి వాటిలో ) చురుకుగా పాల్గొనడం వంటివి తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినట్టు ఆమె పేర్కొన్నారన్నారు . గీతం నుంచి తనకు లభించిన అద్భుతమైన సహకారం వల్లనే ఇదంతా సాధ్యమైనట్టు మేఘన అభిప్రాయపడినట్టు తెలియజేశారు .

వీటికి అదనంగా , అంతర్జాతీయ సమావేశాలు , పోటీలలో మేఘన పాల్గొనడం , సహ రచయితగా నాలుగు సంకలనాలను ప్రచురించడం వంటివి జాతీయ అంతర్జాతీయ స్థాయి విషయాలపై అవగాహన పెంపొందించు కోవడానికి దోహదపడినట్టు ఆమె తెలిపిందన్నారు . నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్ క్రింద సర్టిఫెడ్ సెబర్ క్రైమ్ ఇంటర్వెన్షన్ అధికారిగా తర్ఫీదు పొందడంతో పాటు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొంది , అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మూల్యాకనం చేసిన ప్రొఫెషనల్ ఎథిక్స్ లో కూడా మేఘన శిక్షణ పొందినట్టు తెలియజేశారు .

కోనిడ్ -19 లాక్డ్ డౌన్ సమయంలో చాలా ఆన్లైన్డ్ కోర్సులను చేయడంతో పాటు గీతం ద్వారా కోర్సెరా కోర్సులను కూడా ఆమె అభ్యసించినట్టు వివరించారు . ఈ నేపథ్యం ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి , చివరకు భారతదేశంలోనే అత్యంత కష్టతరమైన పరీక్షలలో ఒకదాని ( క్యాట్ ) లో ఆమె విజయానికి మార్గం సుగమం చేసినట్టు పేర్కొన్నారు . తాను ఈ స్థాయికి రావడంలో తోడ్పడిన తల్లిదండ్రులు , అధ్యాపకులు , విభాగాధిపతులు , ప్రిన్సిపాళ్ళు , డెరైక్టర్లతో పాటు గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్కు మేఘన అభినందనలు తెలియజేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *