గీతమ్ స్మార్ట్ ఐడియాథాన్ -2023

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఐడియా పీచింగ్ పోటీ స్మార్ట్ ఐడియాథాన్-2023’ని ఆగస్టు 24-25 తేదీలలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీల సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే కమ్యూనిటీలను నిర్మించడంలో సహాయపడే స్టార్టన్లలో పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా వారు పేర్కొన్నారు.ఇందులో ఎంపికైన వారికి బూట్ క్యాంపులు, శిక్షణ శిబిరాలను నిర్వహించి, వారి ఆలోచనలను చక్కగా తీర్చిదిద్దేందుకు గాను అంతర్జాతీయంగా శిక్షణ పొందిన వెంచర్ కోచ్ ద్వారా కోచింగ్ ఇస్తామని తెలియజేశారు.ఇందులో ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు, గ్రాంట్లు (దాదాపు 30 లక్షల రూపాయల వరకు) ఉన్నాయని, సెమీ-ఫెన్టల్కు చేరుకునే 32 జట్లకు గీతం హెదరాబాద్ స్పాన్సర్ చేస్తుందని, రెల్లు ప్రయాణం, మూడు:రోజుల పాటు ఆహారం, వసతి సౌకర్యాలను కలుగజేస్తుందని వారు వివరించారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు, జూన్ 10వ తేదీలోగా తమ ప్రతిపాదనలను పంపాలని, మరిన్నివివరాల కోసం: https://smartideathon gitam eduను సందర్శించాలని, smartideathon@gilam.eduకు ఈ-మెయిల్ చేయాలని, లేదా https://rb qy/308bpను క్లిక్వేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *