పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
‘హైదరాబాద్ (తెలంగాణ)లోని ఐటీ సంస్థలలో సంస్థ యొక్క సుస్థిరతపై పర్యావరణ హిత మానవ వనరుల నిర్వహణ (జీహెచ్ఆర్ఎం) అభ్యాసాల ప్రభావం’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వసుధను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.పార్వతి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పర్యావరణ హిత హెచ్ఎర్ఎమ్ సంస్థలలోని మానవ వనరుల నిర్వహణ పద్ధతులలో పర్యావరణ సుస్థిరత సూత్రాల ఏకీకరణ, కార్బన్ ఉనికిని గణనీయంగా తగ్గించడానికి, శక్తివంతమైన, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని పోత్రహించడానికి కార్యాలయంలో పర్యావరణ బాధ్యత సంస్కృతిని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి, ఆర్ధిక-సామాజిక, పర్యావరణ అభివృద్ధికి దోహదపడే విశ్వ ప్రయత్నాలకు అనుగుణంగా ఐటీ సంస్థలలో పర్యావరణ హిత హెచ్ఎర్ఎం పద్ధతులను అనులు చేయడం ద్వారా చేకూరే సానుకూల ప్రభావాన్ని వసుధ పరిశోధన స్పష్టీకరించిందని ఆమె వివరించారు.వసుధ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ఎడీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీసిసిఎస్ఆర్ వర్మ, పలు విభాగాల ఆధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.