మనవార్తలు ,పటాన్ చెరు:
ఎంహెచ్ డీ ఉచిత ఉష్ణప్రసరణ ప్రవాహంపై వేడి , ద్రవ్యరాశి బదిలీ ప్రభావం : ఫినెట్ ఎలిమెంట్ పద్ధతి ‘ అనే అంశంపై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శ్వేత మట్టాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్లోని గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.బాలసిద్ధులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . శ్వేత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రాజా , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .