గీతం స్కాలర్ సంతోషి మిశ్రాకు డాక్టరేట్ ‘ …

Districts politics Telangana

పటాన్ చెరు:

సరళ లేదా కఠినమైన సాగే గుణం ఉన్న షీట్ మీదుగా నానోఫ్లూయిడ్ ప్రవాహం యొక్క వేడి , సామూహిక బదిలీకి సంఖ్యాపరమైన పరిష్కారాలు ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని సంతోషి మిశ్రాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ , గణితశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కె . గోవర్ధన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నానో ఫ్లూయిడ్ యొక్క వేడి , సామూహిక బదిలీ లక్షణాలను సంఖ్యాపరమైన పరిష్కారాల ద్వారా కనుగొనడం జరిగినట్టు ఆయన తెలిపారు . డీ సంతోషి మిశ్రా సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవీ రామారావు , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో వివరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *