పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి సముద్రాల రాజేంద్రప్రసాద్ డాక్టరేటు అర్హత సాధించారు. ‘బేస్-మాడిఫెడ్ న్యూక్లియోసిడ్జ్ డెరివేటిన్స్ యొక్క కీమో/రెజియో-సెలెక్టివ్ సింథసిస్’ చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. పూర్ణచంద్రరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన ప్రాథమిక లక్ష్యం అనేక 3-O-Me, ఇతర ఆల్మెల్- ప్రత్యామ్నాయ న్యూక్లియోసెడ్లను సంశ్లేషణ చేయడం కోసం కార్యాచరణ సరళమైన, రెజియో-సెలెక్టి వ్ ప్రోటోకాల్ లను అభివృద్ధి చేయడమని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా న్యూక్లియోసైడ్ లైబ్రరీ సంశ్లేషణ కోసం ఒక ఆచరణాత్మక హె-త్రూపుట్ పద్ధతిని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఐదు నూతన ప్యూరన్ న్యూక్లియోసిడ్ ఉత్పన్నాలు, కాపురామెసైన్, మెకాలిసిస్ వంటి. జీవశాస్త్రపరంగా ముఖ్యమైన సహజ ఉత్పత్తులున్నాయని తెలియజేశారు.రాజేంద్రప్రసాద్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం. విశ్వవిద్యాలయం, హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్: వర్మ, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రేజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు..