పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, హైదరాబాద్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని లేఖ రాయిపేట్ జైచందర్ ని డాక్టరేట్ వరించింది. ‘అవిశ్వతి పరిమితులతో కూడిన బలమైన విరామం-విలువ గల ఆప్టిమైజేషన్ సమస్యలకు కొంత సహకారం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణ కుమ్మరి సోనువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.అనిశ్చిత డేటాతో ఆప్టిమైజేషన్ సమస్యలను నిర్వహించడానికి రేఖ పరిశోధన బలమైన ఆప్టిమైజేషన్ మెథ డాలజీలపై దృష్టి సారించిందన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐనోటీ), బిగ్ డేటా, కృత్రిమ మేథ వంటి సాంకేతికతలు పెరుగుతున్న వినియోగంతో, వి స్తారమైన, విభిన్నమైన డేటా విశ్లేషణ కీలకంగా మారినట్టు తెలిపారు. ఈ సిద్ధాంత వ్యాసం, ఆప్టిమైజేషన్ సమస్యలలో అనిశ్చితిని ప రిష్కరించడానికి వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టిందన్నారు. వివిధ రకాల బలమైన ఆప్టిమైజేషన్ సమస్యలకు శాడల్ పాయింట్ పరిస్థితులు, పరిష్కారాలను పరిశీలిస్తుందని డాక్టర్ కృష్ణ, వివరించారు.రేఖ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైద్దరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీఏవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.