మనవార్తలు ,పటాన్ చెరు:
అల్ఫా – అమినోఫాస్ఫోనేట్ల తయారీకి సరళమైన , పర్యావరణ హిత నూతన పద్ధతి అభివృద్ధి , దాని చర్యలపై అధ్యయనం ‘ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రవి నాచును డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం . వెంకట నారాయణ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . ఈ పరిశోధనలో , మీథనేసల్ఫోనిక్ యాసిడ్ను ఉత్ప్రేరకంగా వినియోగించడం ద్వారా అల్ఫా – అమినో ఫాస్ఫోనేట్ల తయారీకి : కి సరళమైన , పర్యావరణ అనుకూల పద్ధతిని వృద్ధి చేశామని , అవి అధిక రక్తపోటు నిరోధకంగా పనిచేసినట్టు తెలిపారు . కొన్ని సంశ్లేషణ చేసిన బెంజోప్రిల్ – ఇండోల్ ఆధారిత హెబ్రిడ్ అణువులు క్యాన్సర్కు వ్యతిరేకంగా , వాటి విస్తరింపజేసే లక్షణాలను నిరోధించడానికి పరీక్షించామన్నారు . అలాగే విష రసాయనాలను ఉపయోగించకుండా 5 – సెనో – ఇండోల్ తయారీకి సరళమైన పారిశ్రామిక – స్థాయి సింథటిక్ విధానాన్ని కూడా అభివృ ద్ధి చేసినట్టు తెలియజేశారు . రవి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .