గీతం స్కాలర్ పార్థసారథికి డాక్టరేట్….

Hyderabad

గీతం స్కాలర్ పార్థసారథికి డాక్టరేట్

పటాన్ చెరు:.

నూతన సమీకృత మార్గాల ప్రణాళిక , ప్రధాన రహదారులపై రద్దీ నియంత్రణ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీజ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థి పి.పార్థసారథిని డాక్టరేట్ వరించింది.

ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సిద్ధాంతం సమీకృత విధానంలో రూపొందించారని , రహదారి భద్రతపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని , రహదారి ప్రమాదాల నివారణకు ఇది ఉపకరిస్తుందని ఆయన తెలియజేశారు . ప్రయాణం ప్రారంభం నుంచి గమ్యస్థానం వరకు చిన్న మార్గాలను ఎంపిక చేసుకోవడంలో సహకరించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యమని , ఇది అవరోధాలను తొలగించడంతో ప్రమాదాల నివారణకు తోడ్పడుతుందన్నారు . అంతేకాక , వాహన చోదకుడు పరధ్యానం , అలసట , మగతలను గుర్తించడంతో పాటు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితినికి కూడా పర్యవేక్షిస్తుందని , నష్టనివారణ హెచ్చరికలు జారీచేయడమే గాక , ప్రయాణీకుల భద్రతకు పెద్దపీట వేస్తుందని డాక్టర్ మంజునాథాచారి తెలిపారు . పార్థసారథి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .