గీతం స్కాలర్ మంజులకు పీహెచ్ ‘ జీవ…

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్య ఆవశ్యకత’పై ( Dielectric Relaxations Spectroscopic Studies_of_Hydrogen – Bonded Liquids ) సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి వి.మంజులను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెట్స్లోని భౌతిక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తల్లోజు విశ్వం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . జీవ – ద్రవాల మధ్య పరమాణు పరస్పర చర్యను అర్థం చేసుకోవడం , ప్రోటీన్ల ద్రావణాల వాహకత ప్రవర్తనను గుర్తించి – అర్థం చేసుకోవడం , విత్తన ఉత్పత్తులలో తేమను గుర్తించడం , శరీరంలో అభివృద్ధి చెందిన కణితులను గుర్తించడం ఈ పరిశోధన లక్ష్యంగా ఆయన వివరించారు . ఈ అధ్యయనంలో భాగంగా , ఎనిమిది అంతర్జాతీయ ప్రచురణలతో పాటు ఒక పేటెంట్ను పొందడం , పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని రచించడం విశేషమన్నారు . మంజుల సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష , భౌతిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్ . బాలాజీరావు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *