పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హై దరాబాద్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని ఎన్.అనుపమ డాక్టరేట్ అర్హత సాధించింది. ‘తరగతి అసమతుల్యత డేటా స్ట్రీమ్ లలో సమర్ధవంతమైన అభ్యాసం కోసం నూతన అల్గారిథమిక్ విధానం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ వడలి రవిశంకర్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు, డేటా స్ట్రీమ్ లలో తరగతి అసమతుల్యత సవాలు సమస్యను పరిష్కరించడంపై ఈ పరిశోధన దృష్టి సారించిందని, ఇది మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ రంగంలో కీలకమైన అంశమని తెలిపారు. స్ట్రీమింగ్ డేబా దృశ్యాలలో ఎదురయ్యే తరగతి అసమతుల్యత సమస్యలను తగ్గించడానికి ఆమె అధ్యయనం వినూత్న అల్గారిథమిక్ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించిందన్నారు. ఖచ్చితమైన పరిశోధన, ప్రయోగాల ద్వారా, అనుపమ IOSDS, IFSDS, IUSDS, and MOISDS అనే నాలుగు నూతన పద్ధతులను పరిచయం చేసిందని, ప్రతి ఒక్కటీ డేటా స్ట్రీమ్ లలో తరగతి అసమతుల్యతలను సమర్థంగా నిర్వహించడంలో మంచి ఫలితాలను అందిస్తోందని డాక్టర్ రవిశంకర్ వివరించారు. అనుపము సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీసీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ మహబూబ్ బాషా షేక్స్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.