మన వార్తలు ,పటాన్చెరు:
విషపూరిత రంగులు , వాటి జీవసంబంధ కార్యకలాపాల తొలగింపు కోసం మిశ్రమ లిగాండ్ – ఆధారిత లోహ సేంద్రియ పద్ధతిలో రసాయన సమ్మేళనం మిశ్రమాల సంశ్లేషణ , వర్గీకరణ ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి . అమరావతిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెట్స్‌లోని రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.ఎస్.సురేంద్రబాబు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .
సంశ్లేషణ , నమ్మదగిన , అత్యంత ప్రతిస్పందించే , వేగంగా తిరిగి పొందగల , శీఘ్ర ప్రతిచర్య లోహ సేంద్రియ ఫ్రేమ్‌వర్క్‌లు అవసరమని , వినూత్న పద్ధతుల అభివృద్ధికి పరిశోధనలు అవశ్యమని తెలిపారు . చాలా లోహ మిశ్రమాలు మెరుగైన సూక్ష్మజీవులను చంపే పనితీరును కలిగి ఉంటాయని , సాధారణ పరిస్థితులలో విషపూరిత రంగులను తొలగిస్తాయన్నారు . అందువల్ల గది ఉష్ణోగ్రత లోహ – సేంద్రియ విషపూరితమైన రంగు ఏకాగ్రతను పర్యవేక్షించడానికి , నియంత్రించడానికి చాలా అవసరమని తెలిపారు .
బాహ్య , అంతర్గత పరిస్థితులలో బ్యాక్టీరియా , శిలీంధ్రాలకు వ్యతిరేకంగా సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుందని పేర్కొన్నారు . అమరావతి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , పలువురు విభాగాధిపతులు , అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో వివరించారు .