ఐఐసీటీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు…

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలోని ఎం.ఫార్మసీ, బి.ఫార్మసీ విద్యార్థుల బృందం గురువారం తార్నాకలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)ని సందర్శించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ పి.హెమ్హ, డాక్టర్ పి.గోపీనాథ్ నేతృత్వంలో విద్యార్థుల బృందం మనదేశంతో పాటు దక్షిణాసియాలోనే జాతీయ మోల్ బ్యాంక్ ను కలిగి ఉన్న తొలి ఇన్స్టిట్యూట్గా ప్రసిద్ధి చెందిన సీఎస్ఐఆర్-ఐఐసీటీని సందర్శించింది. ఇక్కడ 16 మిలియన్ల అణువులను ఘన, ద్రవ రూపాలలో మెన్షస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద, క్రయోజెనిక్ పరిస్థితులను ఉపయోగించి నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. కరోనావెర్షస్ మహమ్మారి సమయంలో కోవాక్సిన్ను కనుగొనడంతో పాటు ఎయిడ్స్ చికిత్స కోసం ఔషధాల అభివృద్ధితో ఐఐసీటీ గణనీయమైన కృషి చేసిన విషయం విదితమే.ఈ సందర్భంగా గీతం ఫార్మసీ విద్యార్థులు గౌరవనీయ శాస్త్రవేత్తలు డాక్టర్ సి రామకృష్ణ, డాక్టర్ నవీన్లతో సంభాషించారు. సీ-హార్స్ మెషిన్, కన్ఫోకల్ మెక్రోస్కోప్, ఫ్లో సెట్రోమీటర్, సెల్ కల్చర్ ల్యాబ్, వెట్ ల్యాబ్, ఎనలిటికల్
లాబొరేటరీలతో సహా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వివిధ ప్రయోగశాలలను కూడా విద్యార్థి బృందం సందర్శించి, వాటి పనితీరు గురించి తెలుసుకున్నారు.ఐఐసీటీ సందర్శన విద్యార్థుల కెరీర్ అవకాశాలకు ఉపయోగపడడమే గాక, నుంచి సమాచారాన్ని తెలుసుకుని ప్రేరణ పొందేందుకు, ఆచరణాత్మక అభ్యాసంతో పాటు వృత్తిపరమైన అభివృద్ధికి ఉపకరించింది.అత్యాధునిక పరిశోధన, సాంకేతికలను ప్రత్యక్షంగా చూడడంతో పాటు ఆయా ప్రయోగశాలలను పనితీరును స్వయంగా పరిశీలించారు. ఫార్మాస్యూటికల్ అధ్యయనాలలో వర్థమాన ఫార్మసిస్టులు మరింత శ్రేష్ఠతను కొనసాగించడానికి ఇది దోహపడుతుందడనంలో అతిశయోక్తి లేదు. ఇంత మంచి అవశాకాన్ని గీతం విద్యార్థులకు కల్పించిన సీఎస్ఐఆర్-ఐఐసీటీకి గీతం అధ్యాపకులు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

ఇక్రిశాట్ సందర్శన…

మరో బృందం ఫార్మసీ విద్యార్థులు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇక్రిశాట్ను సందర్శించి,ప్రపంచ ఆహోరోత్పత్తిని మెరుగుపరచడానికి ఇక్రిశాట్ చేపట్టిన అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. తృణ ధాన్యాలతో పాటు ఆహార ధాన్యాల దిగుబడిని పెంచడానికి ఇక్రిశాట్ అమలు చేసిన వ్యూహాలను క్షేత్ర పర్యటనలో పరిశీలించారు. ఈ పర్యటన ఆసాంతం ఉత్తేజకరంగా సాగడంతో పాటు వ్యవసాయ నమూనాల పనితీరు గురించి విద్యార్థులు ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *