Telangana

అత్యుత్తమ ప్రపంచ పరిశోధకుడిగా గీతం ఫార్మసీ అధ్యాపకుడికి గుర్తింపు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీని ప్రపంచంలోని అత్యుత్తము: పత్రాలను ప్రచురించిన రెండు శాతం పరిశోధకులలో ఒకరిగా స్టాన్ ఫోర్డ్- ఎల్వీర్ (2024) గుర్తించి, దాని రికార్డులలో స్థానం కల్పించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఫార్మసీ, ఆరోగ్య పరిరక్షణ రంగంలో డాక్టర్ బప్పాదిత్య చూపిన గణనీయమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి (ఇన్ఛార్జి వీసీ) ప్రొఫెసర్ వై గౌతమరావు, గీతం-హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరన్ దాస్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు డాక్టర్ బప్పాదిత్యను అభినందించినట్టు తెలియజేశారు. తమ తోటి అధ్యాపకులకు స్ఫూర్తినిచ్చేలా సాగిన ఆయన ప్రస్తానం, అంకితభావం, అద్భుత పనితీరును వారు బహుదా ప్రశంసించారన్నారు.ఈ విజయం డాక్టర్ బప్పాదిత్య కెరీర్ లో ఒక మైలురాయిగా మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణను అభివృ ద్ధి చేయడంలో ఆయన పరిశోధన ప్రపంచ ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని డాక్టర్ శివకుమార్ అభిప్రాయపడ్డారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

1 hour ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

3 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago