పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బప్పాదిత్య ఛటర్జీని ప్రపంచంలోని అత్యుత్తము: పత్రాలను ప్రచురించిన రెండు శాతం పరిశోధకులలో ఒకరిగా స్టాన్ ఫోర్డ్- ఎల్వీర్ (2024) గుర్తించి, దాని రికార్డులలో స్థానం కల్పించింది. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఫార్మసీ, ఆరోగ్య పరిరక్షణ రంగంలో డాక్టర్ బప్పాదిత్య చూపిన గణనీయమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.శివకుమార్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి (ఇన్ఛార్జి వీసీ) ప్రొఫెసర్ వై గౌతమరావు, గీతం-హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరన్ దాస్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు డాక్టర్ బప్పాదిత్యను అభినందించినట్టు తెలియజేశారు. తమ తోటి అధ్యాపకులకు స్ఫూర్తినిచ్చేలా సాగిన ఆయన ప్రస్తానం, అంకితభావం, అద్భుత పనితీరును వారు బహుదా ప్రశంసించారన్నారు.ఈ విజయం డాక్టర్ బప్పాదిత్య కెరీర్ లో ఒక మైలురాయిగా మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణను అభివృ ద్ధి చేయడంలో ఆయన పరిశోధన ప్రపంచ ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందని డాక్టర్ శివకుమార్ అభిప్రాయపడ్డారు.
