పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 19-21 తేదీలలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ అప్లికేషన్స్’ (పీఎఫ్ఎంఏ)పై మూడు రోజుల వర్క్షాపు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్, డాక్టర్ మహతర్ రెజాలు సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.ఫ్లూయిడ్ డెన్హమిక్స్ లోని ప్రాథమిక మోడలింగ్ అంశాలు, కనిపించే నానీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లను పరిష్కరించడానికి పెట్టర్ఫేషన్ మెథడ్స్, డిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్, ఎఫ్ఎఎం, ఎఫ్పీఎం వంటి విశ్లేషణాత్మక, సంఖ్యా వర్క్స్ ను పాల్గొనేవారికి పరిచయం చేయడం ఈ వర్క్షాప్ (పార్ట్-4) ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఇందులో పాల్గొనేవారి పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపకరిస్తుందని, అయితే పరిమిత సంఖ్యలోనే పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు, వివరాలను ముందుగా తెలియజేయాలని, వారు రెండు విధాలుగా- ఆసక్తి ఉన్న సమస్యపై ప్రెజెంటేషన్ను తీసుకురావడం, లేదా అప్పటికప్పుడు సమస్యను ఎంచుకొని ప్రదర్శనను సిద్ధం చేయడంగా వారు వివరించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ https://forms.gle/wdrFnKe3fZvViTyH9 ద్వారా నేరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదా ఇతరత్రా వివరాల కోసం డాక్టర్ జె. విజయశేఖర్ (9700 6688 75)ను సంప్రదించాలని సూచించారు
