– టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు
మనవార్తలు , పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ( అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వెల్లడించారు . ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , ఆర్కిటెక్చర్ , హ్యుమానిటీస్ వంటి కోర్సులను గీతం , హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజారోగ్యం , ఐటీ రంగాలలో పెరుగుతున్న డిమాండ్ , భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకుని 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో నాలుగేళ్ళ బీ . ఆప్తోమెట్రీ కోర్సు , భారతీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సౌజన్యంతో బీఎస్సీ కంప్యూటర్ సెర్చ్ అండ్ కాగ్నెటివ్ సిస్టమ్స్ , బీటెక్లో సీఎస్ & బీఎస్ కోర్సులతో పాటు మాస్టర్స్ ఇన్ పబ్లిక్ పాలసీని ప్రారంభినట్టు తెలియజేశారు . అలాగే బీటెక్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి అత్యుత్తమ పాఠ్యప్రణాళికతో రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ – మెషీన్లెర్నింగ్ , ఐవోటీ , సెబర్ సెక్యూరిటీ , డేటాసెన్స్ , రొబోటిక్స్ & ఆటోమేషన్ , వీఎల్ ఎస్ఐ , స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ , ఎలక్ట్రిక్ & హెబ్రీడ్ వెహికల్స్ వంటి స్పెషలైజేషన్లతో బీటెక్ కోర్సులను నిర్వహిస్తున్నట్టు వివరించారు .
గీతం ప్రవేశ పరీక్ష ( గాట్ -2022 ) దరఖాస్తులను గీతం వెబ్సైట్లో ( www.gat.gitam.edu ) అందుబాటులో ఉంచామని , ఆన్లైన్లోనే నేరుగా దరఖాస్తు చేయవచ్చని డాక్టర్ శివప్రసాద్ సూచించారు . ప్రోక్టోర్డ్ విధానంలో నిర్వహించే రెండు గంటల నిడివి గల గీతం ప్రవేశ పరీక్షలో వంద బహుళ ఎంపిక ( మల్టిపుల్ ఛాయిస్ ) ప్రశ్నలుంటాయని , ఒక్కో సరైన జవాబుకు రెండు మార్కులిస్తారని , పరీక్ష పూర్తయిన వెంటనే మొత్తం 200 కు గాను ఎన్ని మార్కులు సాధించినదీ అప్పటికప్పుడే తెలిసిపోతుందని ఆయన వివరించారు . ఈ పరీక్షలో విద్యార్థి చూపిన ప్రతిభ ( మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తామన్నారు .
గీతం ప్రవేశ పరీక్షతో పాటు జేఈఈ మెయిన్ , ఏపీ ఈఏపీసెట్ , తెలంగాణ ఎంసెట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అర్హులైన విద్యార్థులకు ఆకర్షణీయమైన స్కాలర్షిస్లు ఇస్తామని ప్రోవీసీ చెప్పారు . క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గీతం ప్రవేశాలలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు స్కాలర్షిస్లను మంజూరు చేస్తామన్నారు . తొలి ఏడాది స్కాలర్షిస్లు పొందినవారు ఆ తరువాతి సంవత్సరాలలో 8.0 అంత కంటే ఎక్కువ సీజీపీఏ సాధిస్తేనే ఫీజులో రాయితీ కొనసాగుతుందన్నారు . గీతం ప్రవేశ పరీక్ష రాయదలచిన విద్యార్థులు , ఇతర వివరాల కోసం 95 42 42 42 56 / 59 లను సంప్రదించాలని లేదా gat@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు .
