గీతమ్ ఈనెల 27న టెన్ఎక్స్

Telangana

_ఉపన్యసించనున్న గౌతం వాసుదేవ్ మీనన్, శిల్పారెడ్డి, సజ్జాద్ షాహిద్ తదితరులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

టెడ్క్స్ గీతం హెదరాబాద్ కార్యక్రమ నిర్వహణకు గీతం హెదరాబాద్ ప్రాంగణం సిద్ధమవుతోంది. ‘రివెండ్ ది మిలీనియం’ ఇతివృత్తంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే అంతర్దృష్టి ఆలోచనలను ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వవిద్యాలయ వర్గాలు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. | ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్: ఫ్యాషన్ డిజెనర్, సన్కార్డ్ వ్యవస్థాపకురాలు, ఏకమ్ లెర్నింగ్ సెంటర్ సహ వ్యవస్థాపకురాలు శిల్పా రెడ్డి; ప్రసిద్ధ చిత్రకారుడు సజ్జాద్  షాహిద్; స్కిప్పి ఐస్ పాన్స్ వ్యవస్థాపక జంట రవి – అనుజా కబ్రా; తెలుగు-ఆంగ్ల పాటల రచయిత, ఇండీ సంగీత.కళాకారుడు నితీష్ కొండపర్తి; ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సనిత శాస్త్రి తదితరులు టెడ్ ఉపన్యాసాలు చేయనున్నారు.ఆలోచనలను ప్రేరేపించే కేంద్రీకృత చర్చలు, విస్తృత శ్రేణి విషయాలపై లోతైన అవగాహన కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు, రుసుము తదితర వివరాల కోసం రెడ్డి (8790408465) లేదా లోకేష్ (9394843115)ని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *