గీతమ్ జాతీయ రీసెర్చ్ సింపోజియం….

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ) హెదరాబాద్ ఆధ్వర్యంలో మే 19-20 తేదీలలో ‘నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ జి. సునీల్ కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సింపోజియం ‘ఆర్కిటెక్చర్, అర్బనిజం- బిల్డ్ ఎన్విరాన్మెంట్’ అనే ఇతివృత్తంపై_ ఆధారపడి ఉంటుందన్నారు. సమర్థమైన రూపకల్పన (డిజెన్), నాణ్యమైన రేఖాచిత్రా (డ్రాయింగ్ లతో పాటు ఖాతాదారులు, సహోద్యోగులు, ఇతర వాటాదారులకు తమ ఆలోచనలు, డిజెన్లను వివరించడానికి ఆర్కిటెక్ట్ కు మంచి పదజాలం, రాత నెపుణ్యాలు అవశ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశోధనా పత్రాన్ని రాయడం వలన విద్యార్థులు వివిధ వనరుల నుంచి సమాచారాన్ని విశ్లేషించడానికి, మూల్యాంకనం చేయడానికి, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడానికి, నూతన ఆలోచనలు, దృక్కోణాలను అన్వేషించడానికి, భవిష్యత్తు కెరీర్ అవకాశంగా పరిశోధనపె ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఉపకరిస్తుందన్నారు.ఆర్కిటెక్చర్ రంగంలోని నిపుణులతో తమ పనిని పంచుకోవడానికి, తమ పరిశోధనపై వారి అభిప్రాయాన్ని స్వీకరించడానికి ఆర్కిటెక్చర్ విద్యార్థులకు ఈ సింపోజియం ద్వారా తాము ఓ అవకాశం కల్పిస్తున్నామని సునీల్ చెప్పారు.

తాము కనుగొన్న విషయాలను ఇతరులకు తెలియజేయడానికి, కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడానికి, వినూత్న ఆలోచనలు, ప్రచురణ అవకాశాల గురించి తెలుసుకోవడానికి, వ్యక్తిగత వత్తిపరమైన అభివృద్ధికి దోహదపడటానికి తాము ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.ఈ సింపోజియంలో పాల్గొనేవారు తమ పత్రాలను 15 ఏప్రిల్ 2023లోగా సమర్పించాలని, అత్యుత్తమ పేపరు ప్రశంసా పత్రంతో పాటు ఆకర్షణీయమైన నగదు పురస్కారాలు కూడా ఉంటాయని సునీల్ కుమార్ తెలియజేశారు. పత్ర సమర్పణ చేసే వారికి ఉచితంగానే పాల్గొనే వీలు కల్పిస్తున్నామని, దానితో పాటు థర్డ్ ఏ/సీ రెల్లు టిక్కెట్టు, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం spaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *