కళలపై గీతమ్ జాతీయ సదస్సు…

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

లలిత కళలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ‘ప్రదర్శనాత్మక భారతం’ (పెర్ఫార్మేటివ్ ఇండియా) పేరిట ఈనెల 27న ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నది. ఈ విషయాన్ని లలిత కళలు విభాగం సమన్వయకర్త, సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ మెథైలి మరాట్ అనూప్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించారు.హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఎస్.ఎన్. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నృత్య విభాగం ప్రొఫెసర్, నటి డాక్టర్ అరుణ భిక్షు ముఖ్య వక్తగా పాల్గొంటారని తెలియజేశారు. ఐఐటీ బాంబేలోని భాష-సాహిత్య అధ్యయనాల విశ్రాంత ఆచార్యుడు, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు డాక్టర్ మిలింద్ మల్లే మరో వక్తగా పాల్గొంటారన్నారు.’సమకాలీన కాలంలో ప్రదర్శనల సౌందర్యం: డిజిటల్ యుగంలో వాటి తీరుతెన్నులు’ అనే అంశంపై నిర్వహించనున్న చర్చాగోష్ఠిలో ఐఐటీ హైదరాబాద్ లోని డిజెన్డ్ విభాగానికి చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ; కేరళకు చెందిన ప్రముఖ థియేటర్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ చంద్ర దాసన్; సిలికాన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం-త్రిబుల్ ఐటీ హెదరాబాద్ లోని సంగీత విభాగం అధ్యాపకులు డాక్టర్ టీకేఎల్ సరోజలు పాల్గొంటారని ఆమె వివరించారు.యునెస్కో గుర్తింపు పొందిన సాంప్రదాయ భారతీయ కళారూపం ‘కుటియాట్టం’ను సదస్సు ముగింపు సమయంలో ప్రదర్శిస్తారని డాక్టర్ మెథైలి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *