పటాన్చెరు:
పటాన్చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఎన్సీసీ యూనిట్ ను నిజామాబాద్ లోని 33 (తెలంగాణ) బెటాలియన్ ప్రధాన కార్యాలయ కమాండర్ కల్నల్ హెచ్ఎస్ఎస్ కృష్ణకుమార్ గురువారం తనిఖీ చేశారు. ఆయన వెంట 33 (తెలంగాణ) బెటాలియన్, సంగారెడ్డి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కె.సింగ్ కూడా ఉన్నారు. కల్నల్ కృష్ణకుమార్ గీతం ఎన్సీసీ క్యాడెట్లతో ముఖాముఖి చర్చించడంతో పాటు, వారి పనితీరును ప్రశంసించారు.

మెరుగైన ప్రమాణాలను సాధించడానికి నిరంతరాయంగా శిక్షణ నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. అత్యుత్తమ శిక్షణ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీలలో రాణించగలరని అభిలషించారు. నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ గా పిలిచే గీతం గ్రంథాలయాన్ని సందర్శించి, అక్కడి ప్రమాణాలను ఆయన బహుదా ప్రశంసించారు. తొలుత, కల్నల్ కృష్ణకుమార్‌ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఎన్సీసీ అధికారి డాక్టర్ ఆర్.శ్రీనివాసరాజు స్వాగతించి, శాలువాతో సత్కరించారు

