గీతమ్ డిజిటల్ పరీక్షల అమలుపై కార్యశాల

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జూన్ 1, 2024 డిజిటల్ హాజరు విధానం, డిజిటల్ పరీక్షల అమలుపై ఒకరోజు కార్యశాలను నిర్వహించారు. పరీక్షల ప్రక్రియలో పాత పద్ధతులను ఆధునీకరించడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం, విద్యార్థుల దుష్ప్రవర్తనను అరికట్టడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా బెంగళూరు అదనపు ఉపకులసతి, క్యాట్స్ ఇన్ఛార్జి ప్రొఫెసర్ కె.ఎన్.ఎస్.ఆచార్య హాజరయ్యారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల అధిపతులు, హ్యుమానిటీస్, లీ-స్కూల్ డైరెక్టర్లు , స్కూల్ ఆఫ్ సెర్చ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, క్యాట్స్ బృందం, అతిథ్య విభాగం, పరీక్షల విభాగం, మానవ వనరుల విభాగాల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గీతం పరీక్షా ప్రక్రియ సంస్కరణలు, సామర్థ్యం, పారదర్శకతను పెంపొందించడానికి డిజిటల్ సాంకేతికతలను స్వీకరించడంపై వారు దృష్టి సారించారు.పరీక్షా ప్రక్రియ విధాన్నంతా పునర్ మూల్యాంకనం చేయడం, బయోమెట్రిక్ ద్వారా ప్రవేశం, క్యూఆర్ కోడ్ ప్రామాణీకరణ వంటి డిజిటల్ సాంకేతికతలను పరిచయం చేయడం, మానవ ప్రమేయాన్ని తగ్గించడం వంటిని వాటి సాధ్యాసాధ్యాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.డిజిటల్ కెమెరా పర్యవేక్షలో తరగతి గదులు, లెఫ్ట్ వీడియో ఫీడ్ ట్రాకింగ్, మొబైల్ యాప్ ఆధారిత మద్దతు: వంటి ప్రతిపాదిత డిజిటల్ సాంకేతికథలను అమలు చేయవలసి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.

ఈ సాంకేతికతలను వినియోగించి పరీక్షలో నిర్వహణ కోసం తరగతి గదుల కేటాయింపులను ఆటో మేట్ చేయడం, ఇన్విజిలేషన్ ప్రక్రియలను ట్రాక్చేయడం, జవాబుపత్రాలను సురక్షిత నిల్వ చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు.అధ్యాపకులు విధులను ఆధునిక సాంకేతికత సాయంతో పర్యవేక్షించడం, హాజరును సులువుగా తీసుకోవ డంతో పాటు పరీక్షల సమయంలో దుర్వినియోగాలను నివారించడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా సద్యులు లేవనెత్తిన సందేహాలకు ప్రొఫెసర్ కె.ఎన్.ఎస్. ఆచార్య తగిన జవాబులిచ్చి సమాధానపరిచారు.కార్యశాల చైర్ పర్సన్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య పర్యవేక్షణలో, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి సారథ్యంలో, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) జిగోపాలకృష్ణ సమన్వయంతో ఈ వర్కుషాప్ విజయవంతంగా ముగిసింది,డిజిటల్ టెక్నాలజీలను స్వీకరించడం ద్వారా పరీక్షా ప్రక్రియను మెరుగుపరచడానికి గీతం కట్టుబడి ఉందని ఈ కార్యశాల నిర్వహణ ద్వారా చాటిచెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *