పటాన్చెరు:
న్యూఢిల్లీలోని ప్రసిద్ధ వైద్య సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాను గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించనున్నారు. గీతం గా పేరొందిన గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 41వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 14 న డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో గీతం అధ్యక్షుడు Cసమక్షంలో’ ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న డాక్టర్ రణదీప్ గులేరియాను, వైద్య రంగంలో ఆయన అందించిన విశన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుతో పాటు ఒక ఫలకాన్ని ప్రదానం చేయనున్నారు.
భారతీయ సమకాలీన వైద్యశాస్త్ర దీపస్తంభం, నిష్ణాతుడైన పరిశోధకుడు, పరిపాలనాధికారి డాక్టర్ రణదీప్ ఒక ప్రఖ్యాత సర్మోనాలజిస్ట్, సల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ లో డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ (ఓఎం) పొందిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. గత 30 ఏళ్ళగా ఎయిమ్స్ లో సేవలందిస్తున్న ఆయన ప్రస్తుతం పల్మనరీ మెడిసిన్, స్లీప్ డిజార్డర్స్ ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్ మూర్తి ‘గీతం ఫౌండేషన్ అవార్డు’ను మూడు కోట్ల రూపాయల నిధితో ఏర్పాటు చేశారు. విద్య, ఆర్థిక, శాస్త్ర, సాహిత్య, కళలు, ప్రజా సేవలలో అసమాన సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను ప్రతియేటా ఈ అవార్డుతో సత్కరిస్తున్నారు.
ఇంతకు మునుపు డాక్టర్ కరణ్ సింగ్, పీకే బిష్ణోయ్, డాక్టర్ పీఎంఎస్ ప్రసాద్, డాక్టర్ సంజయ్ బారు, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ బీఆర్ పంచముఖ, డాక్టర్ సి.రంగరాజన్, డాక్టర్ ఏ.శివథాను పిళ్ళై, ప్రొఫెసర్ సీ.ఎస్ఆర్ రావు, డాక్టర్ తకాకి కజిట, డాక్టర్ మెఖేల్ డబ్ల్యూ యంగ్, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ వంటి ప్రముఖులు గీతం ఫౌండేషన్ అవార్డును అందుకున్నారు.