మనవార్తలు,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సెన్ట్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఐవోటీ యూజింగ్ పెథాన్ ‘ అనే అంశంపై ఈనెల 16-18వ తేదీలలో మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎఫ్ఎపీ ) నిర్వహించనున్నారు . గీతం డెరైక్టరేట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ ప్రణయనాథ్ రెడ్డి , డాక్టర్ దీపక్ ఎన్ . బిరాదర్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భౌతిక పరికరాలు , సాఫ్ట్వేర్లు , సెన్సార్లు , నెట్వర్క్ కనెక్టివిటీల ఇంటర్ – నెట్వర్కింగ్ను కలిగి ఉన్న ఐవోటీ ప్రాజెక్టులను నిర్వహించడంపై ఈ అధ్యాపక వికాస కార్యక్రమం దృష్టి సారించనున్నట్టు వారు తెలియజేశారు .
డేటాను సేకరించడానికి , మార్పిడి చేయడాన్ని కూడా అనుమతిస్తామన్నారు . ఈ మూడు రోజుల ఆచరణాత్మక సాధనలో పాల్గొనే అధ్యాపకులకు అంతర్జాతీయ సామర్థ్యాలతో పాటు నెపుణ్యాలను కూడా పొందవచ్చని తెలిపారు . ప్రయోగాల ద్వారా సంపూర్ణ అవగాహన ఏర్పరచుకునేలా హార్డ్వేర్ పరికరాలను అందిస్తామని , ఇందులో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలను కూడా పంపిణీ చేస్తామని చెప్పారు .
ఈ ఎఫీపీలో ఆర్డినో ఆర్కిటెక్చర్ , ప్రోగ్రామింగ్ , నోడ్ ఎంసీయూ , ప్రాథమిక ఐవోటీ ప్రాజెక్టులతో పనిచేయడం , సెన్సార్ ఇంటర్ఫేస్ , ఓపెన్ – సోర్స్ క్లౌడ్ , క్లౌడ్ వెపు డేటా లాగింగ్ వంటి అంశాల గురించి అవగాహన ఏర్పరచుకోవచ్చని తెలిపారు . ఆసక్తి ఉన్నవారు తమ పేర్ల నమోదు , ఇతర వివరాల కోసం డాక్టర్ ప్రణయనాథరెడ్డి 90108 43555 ని సంప్రదించాలని , లేదా https://forms.gle/NjKYCiFc1t7MNXW7 కు లాగిన్ అవ్వాలని సూచించారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…