పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం – 2023 ని డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ వారు ఘనంగా నిర్వహించారు. భారతీయ ఫీల్డ్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చండీ ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడలు, ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు.బీఏ సెక్షాలజీ విద్యార్థిని రియా సాహంకు 2023 ఏడాదికి గాను అత్యుత్తము క్రీడా ప్రదర్శన” అవార్డును ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా గీతం కళాకృతి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులను, అలరించాయి.



జాతీయ క్రీడా దినోత్సవం గురించి..
మేజర్ ధ్యాన్ చంద్ శాశ్వతమైన వారసత్వానికి ఘన నివాళిగా మనదేశంలో ప్రతియేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మనదేశంలో బలమైన క్రీడా సంస్కృతి అభివృద్ధికి ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కేవలం పోటీ కోసమే కాకుండా సంపూర్ణ వ్యక్తిగత ఎదుగుదల కోసం వివిధ క్రీడలు, ఆటలలో చురుకుగా పాల్గొనేలా యువతను ప్రోత్సహిస్తుంది. క్రమశిక్షణ, పట్టుదల, క్రీడా స్ఫూర్తి, బృంద కృషి వంటి వాటిపై అవగాహనను పెంపొందించడమే కాక, వారి దినచర్యలో భాగంగా మార్చే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తారు. అథ్లెట్ల సహకారం, సంకల్పం, వారి అసాధారణ విజయాలు, సమాజంపై దాని ప్రభావాన్ని గుర్తుచేసుకోవడానికి జాతీయ క్రీడా దినోత్సవం తోడ్పడుతుంది.
